Sunday, July 19, 2009

దెయ్యాల పండుగ

బౌద్ద సన్యాసులు తన కుమారుడిని తీసుకుపోకుండా చేయడానికి ఆమె ఓ ఎత్తు వేసింది.
సాధారణంగా సన్యాసులు శాఖాహారం మాత్రమే తీసుకుంటారు. అయితే ము లియాన్
తల్లి తన ఇంటికి వచ్చిన సన్యాసులకు కొన్ని కూరగాయలతోపాటు కొన్ని మాంసం
ముక్కలను కూడా వేసింది. దీంతో తల్లి వెంటనే దేవతల శిక్షకు గురై నరకానికి పోయిందని
ఓ కథ. తల్లిని కాపాడాలనే ఉద్దేశంతో ము లియాన్ కూడా నరకం లోపలకు చొచ్చుకుపోయాడు.
పోగా పోగా, తల్లి ఒకచోట చుట్టూ రక్తంతో కూడి ఉన్న ముళ్ల పరుపుపై కూర్చుని ఉండటం చూశాడు.
తన తల్లికి తినడానికని మూ లియాన్ కాస్త ఆహారం పెడితే అది వెంటనే నిప్పు లేదా రక్తంలా మారిపోయింది.
దీంతో చేసేదేమీ లేక అతడు తిరిగి ఇంటికి పోయి పూజ ప్రారంభించాడు.

మూలియాన్ ప్రార్థనలను ఆలకించిన బుద్దుడు కరిగిపోయాడు. సంవత్సరంలో ఒక రోజున నరక
ద్వారాలు అన్నీ తెరిచి ఉంచాలని, ఆత్మలు ఆ రోజున భూమ్మీదికి వస్తాయని,ఆప్తులైన వారు
వాటికి ఆహార పదార్ధాలు వడ్డించవచ్చని ఆదేశాలు జారీ చేస్తాడు.చాంద్రమాసం ప్రకారం ఏడవనెల
ఏడవ రోజు (జూలై 15)న చైనీయులు అప్పటినుంచి ఆకలిగొన్న దెయ్యం పండుగను పెద్ద ఎత్తున
జరుపుకోవడం మొదలెట్టారు. చైనా సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అయిదు పెద్ద పండుగ
దినాల్లో ఇది ఒకటి.
జూలై 15 రాత్రి చైనాలో ప్రతి ఇంటి ముందు ఆహారం, నీరు ఉంచుతుంటారు.ఇలా చేస్తే దయ్యాలు
తమ ఇళ్లలోకి రాకుండా ఉంటాయని బయటే ఆహారంతిని వెళ్లిపోతాయని, తమకు సమస్యలు
సృష్టించవని చైనీయుల నమ్మకం.ప్రత్యేకంగా కాగితంతో చేసిన డబ్బును ఈ పర్వ దినం సందర్భగా
చైనీయులుతగులబెడతారు.
దయ్యాలు ఆ కాగితాల మసిని తీసుకుని నరకానికి పోయి అక్కడ తమక్కావలసిన వాటిని ఖర్చు
పెట్టుకుంటాయని చెప్పారు. దయ్యాలు తమకు చిక్కులు కలిగించకుండా ఆరోజంతా చైనీయులు
నాటకాలు, రూపకాలు తదితర ప్రదర్శనలలో పాల్గొంటారు.
భూమ్మీద తమ వారసులను కలుసుకోవడానికి జూలై 15న ఆత్మలు, దయ్యాలునరక ద్వారాలను
దాటి భూమ్మీదికి వస్తాయి. ఈ సందర్భాన్నే చైనీయులు దయ్యాల పండుగలాగా జరుపుకుంటారు

.

No comments:

Post a Comment