Thursday, July 23, 2009

సుందరకాండ - 4

త్రిజట తన కల గురించి రాక్షసస్ర్తీలకు చెబుతూండగా మరోవైపు సీత దుఃఖ వివశురాలై బెంబేలు పడిపోయింది. ఎటు చూసినా ఆమెకు ఆశ అన్నది లేదు. రావణుడో, రాక్షస స్ర్తీలో తనను తప్పక చంపుతారనీ, తాను రాముడి కొరకు ఇంత కాలమూ ఎదురు చూడటం నిష్ర్పయోజన మయిందనీ ఆమె అనుకున్నది. నోరెండిపోతూ ఆమె శింశుపా వృక్షం కిందికి పోయి, ఆత్మహత్య చేసుకునే ఆలోచన చేస్తూ తన జడను మెడకు చుట్టుకున్నది. అంతలోనే ఆమెకు శుభ శకునాలు కలిగాయి. ఆమె ఎడమ కన్ను గట్టిగా అదిరింది, ఎడమ భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది. ఈ శుభ శకునాలు చూసి ఆమెకు కొత్త ప్రాణం వచ్చినట్టయింది.
ఇంతసేపూ శింశుపా వృక్షంలో కూర్చుని ఉన్న హనుమంతుడు అంతా చూశాడు. అన్నీ విన్నాడు. కాని అతనికి ఏం చెయ్యటానికీ ఒకంతట పాలుపోలేదు. తాను రాముడి వార్త సీతకు చెప్పి, ఆమె సందేశం రాముడికి అందించాలి. సీతతో మాట్లాడకుండానే తిరిగిపోతే సీతకు రాముడి విషయం తెలియదు; ఆమె ఇక్కడి బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవచ్చు. అదీ గాక, ‘‘సీత ఏమన్నది?'' అని రాముడు తప్పక అడుగుతాడు. ‘‘నేనామెతో మాట్లాడలేదు,'' అంటే రాముడు తన చూపులతోనే నన్ను దగ్ధం చేస్తాడు. పోనీ సీతతో మాట్లాడతామంటే రాక్షస స్ర్తీలంతా ఉన్నారు. పైగా, సీత తనను చూసి రావణుడే మాయూ రూపంలో వచ్చాడనుకుంటుందేమో! అప్పు డామె భయపడి కెవ్వున అరవగానే రాక్షస స్ర్తీలు తన పైకి ఆయుధాలతో వస్తారు

.

No comments:

Post a Comment