Saturday, July 11, 2009

మొట్ట మొదటి పాత్ర రామయణంలో:ఋశ్య శృంగుడు

మొట్ట మొదటి పాత్ర రామయణంలో:ఋశ్య శృంగుడు కధ ప్రారంభం: ఋశ్య శృంగుడు విభాండకమహర్షి కుమారుడు భాండకుని వలన అతడు లేడికి కలిగిన సంతాన మని పురాణకధ ఉంది అతడున్న ప్రదేశం (ఇప్పుడు మన మనుకునే శౄంగేరి పీఠం)సకాలంలో వర్షములు కురిసి సశ్యశ్యామలంగ ఉంటుంది పుత్రకామేష్ఠి యాగంలో ఈ మహర్షి పాల్గొన్న తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది వేద పారంగుడయిన ఋశ్య శృంగుడు తండ్రి ఆశ్రమమునందే తపస్సు చేసుకునేవాడు లోకమునందలే వ్యవహార జ్ఞానం బొత్తిగా తెలియదు.ఎన్నడు కూడ స్త్రీముఖం చూసి ఎరుగడు.అంతేకాదు తండ్రి తప్ప మరొక పురుషుని చూడలేదు రోమ పాదుడనే అంగ దేశదీశుడు ధర్మోల్లంఘనం చేసినందువలన ఆ దేశంలో బహుకాలం వర్షములు కురియలేదు.ఋశ్య శౄంగుని దేశంలోకి రప్పించిన వర్షములు కురుస్తాయని రాజపురోహితులు,మహర్షులు చెప్పారు.వారి ఆ దేశనుసారం ఋశ్య శౄంగుడిని తన రాజధానికి రప్పించడానికి రోమపాదుడు అనేక ప్రయత్నములు చేసి నిస్సహయుడై చివరకు ఉహా తట్టి వేశ్యలను పంపేడు ఋశ్య శౄంగుని ఆశ్రమం దాపులోనే రోమపాదును వేశ్యలు రాజ శిబిరాలు ఏర్పరుచుకొని నాట్యం చేయసాగరు తపస్సు తప్ప మరొక భావం లేని ఋశ్య శ్రుంగుడు ఆ వేశ్యలను గాంచి వారిని మహర్షులుగాను వారి రాజ శిబిరాలను ఆశ్రమాలుగాను భావిస్తాడు సంగీత సాహిత్యముల సమ్మేళనంతో రూప లావణ్య వతులైన వేశ్యములు చేసే నాట్యం ఆయనను ఎంతగానో ఆకర్షించాయి ఆ వేశ్యలందరు,సుఖుమార దేహాలకు ఋశ్య శౄంగుని ఆలింగనం చేసుకొని వివిధ బక్ష బోజ్యలు అమర్చి ఆ మహర్షికి అందజేస్తే అవి ఆరగించి వానిని అపూర్వ పుణ్యఫలాలుగా భావించాడు ఇంతటి అపూర్వమైన తాపసుల ఆశ్రమములు ఎంత రమ్యంగా ఉంటయో కధ!అని భావించిన ఋశ్య శౄంగుని,వేశ్యలు తమవెంట ఆహ్వనించారు.ఋశ్య శౄంగుడు చక్కగా అలంకరించిన రధంలో కూర్చుని వస్తుండగా వెనుకవైపునుండి వర్షధారలు మొదలయి రోమపాదుని రాజ్యమంత వర్షం కురిసి శుభిక్షమయింది తన రాజ్యానికి విచ్చేసిన మహర్షికి రోమపాదుడు తన పెంపుడు కుమార్తే అయిన శాంత నిచ్చి వివాహం జరిపించి కొంతకాలం తన రాజధానిలోనే ఉంచుకున్నాడు శంత ఋశ్య శౄంగులకు చతురంగుడుఇ అనే కూమారుడు కలిగేడూ కొంతకాలం తరువాత దశరధుడు పుత్రకామేష్ఠి యాగం జరుప నిశ్చయించగా మహర్షులు ఋశ్య శౄంగుని మహత్తు తెలియపరచి ఆయనను పిలిస్తేనేగాని యజ్ఞం సఫలంకాదు అని చెప్పారు .వెంటనే దశరధుడు శంత,ఋశ్య శౄంగులను యాగని ఆహ్వనించాడు యజ్ఞం పూర్తిగాగాని ఋశ్యశౄంగుడూ భార్య శౄతులతో సహ తన ఆశ్రమనికి వెళ్ళడు ఈ విధంగా శ్రీ రాముని పుట్టుకకు ఋశ్య శౄంగుని ప్రమేయం ఎంతో ఉంది పుత్ర కామేష్థియాగ ఫలంలో ఋశ్య శ్రుంగుడు ప్రధాన పాత్ర

No comments:

Post a Comment