Monday, July 27, 2009

‘విఘ్నేశ్వరా-6

‘‘విఘ్నేశ్వరా! ఇప్పుడు నీవు చేసిన గజాసుర నిర్మూలన జ్ఞాపకంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కలకాలం ఘనంగా జరుగుతూంటాయి. ముందుకాలంలో ప్రజల స్వేచ్ఛ, శ్రే…యస్సుల కోసం సాగే ఉద్యమాలు గణేశ ఉత్సవాలతో జ…యప్రదంగా కొనసాగి ఫలిస్తాయి. భూలోకంలో వైభంగా జరిగే ఉత్స వాలన్నిటికీ గణపతి నవరాత్రి ఉత్సవం తిలకంగా ఉంటుంది!'' అని ఆకాశవాణి పలికింది. విష్ణువు విఘ్నేశ్వరుడితో, ‘‘పార్వతీనందనా! మేనల్లుడివని చెప్పి నాకు మరొకపని కూడా కల్పించావా!'' అన్నాడు. విఘ్నేశ్వరుడు, ‘‘మేనమామ వరసపెట్టి కాలనేమి అయిన కంసుణ్ణి మేనమామ గండాన నువ్వెలాగూ పుట్టి, చంపుతావుగదా! ఇలాంటి వరసలన్నీ నీవు నేర్పిన విద్యలేగదా నీరజాక్ష!'' అన్నాడు. విష్ణువు, ‘‘విఘ్నవినాశకా! నీ పరశువు ముందు, నా చక్రా…ుుధం ఏపాటి? నీ గొడ్డలి సాము చూసినప్పుడు మహముచ్చటేసింది సుమా!''అన్నాడు. ‘‘పరశురామావతారంలో నా గొడ్డలి ఎరువు తీసుకెళ్ళి గర్వపోతులైన క్షత్రి…యుల్ని తెగ నరుకుదువుగానిలే!''అన్నాడు విఘ్నేశ్వరుడు. విష్ణువు, ‘‘గజవిఘ్నాసురుడి మీద ఎక్కి మర్దిస్తున్నప్పుడు నీ బుడిబుడి నడకల గుజ్జు రూపం కూడా నన్నెంతో మురిపించిందోయి!'' అన్నాడు. ‘‘అలాగైతే, వామనుడివై బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కుదువుగానిలే!'' అని విఘ్నేశ్వరుడు అన్నాడు.

చందమామ 1947 నాటి మొట్తమొదటి పేజి


.

Sunday, July 26, 2009

విఘ్నేశ్వరుడు - 5

పార్వతి క్షణంలో తన దుఃఖమంతా మరిచి పోయి, పిల్లవాణ్ణి ఎత్తుకుని దిష్టి తీసింది. శివుడు చేతులు చాచి పిలిచాడు. మళ్ళీ ఏం చేసిపోతాడో అని భ…ుం భ…ుంగా తప్పట డుగులువేస్తూ వెళ్ళిన విఘ్నేశ్వరుడి ముద్దు చేష్టకు అంతా ముచ్చటపడ్డారు. ‘‘నా…ునా, విఘ్నేశ్వరా! నిన్ను పుత్రు డిగా పొంది ధన్యులం అ…్యూం. చిరంజీవ!'' అని శివుడు ఎత్తి ముద్దాడుతూంటే విఘ్నే శ్వరుడు కిందకు దూకి, ‘‘తండ్రీ! ఎంతమాట, నేను మీ కొడుకును, ధన్యుణ్ణి నేను!'' అంటూ పార్వతీ శివుల పాదాలను చిరుతొండంతో చుట్టి, కళ్ళకద్దుకొని ప్రణామాలు చేశాడు. తరవాత బుల్లిబుల్లి అడుగులతో వెళ్ళి, విష్ణువును సమీపించి ఆ…ునకు ప్రణామం చేశాడు. విష్ణువు, ‘‘రావోయి ముద్దుల మేనల్లుడా!'' అని దగ్గరకు తీసుకొని, ‘‘కళ్యాణమస్తు!'' అని దీవించాడు. అప్పుడు విష్ణువు కాంతిలో విఘ్నేశ్వరుడు నీలాకాశం రంగులో కనిపించాడు. విష్ణువుకూ, విఘ్నేశ్వరుడికీ ఏవో పోలికలున్నట్లు అంద రికీ తోచింది. అదే మేనమామ పోలిక అంటే! అని అనుకున్నారు. వినా…ుకుడు బ్రహ్మకు నమస్కరించాడు. బ్రహ్మ, ‘‘తొలిపూజలందుకోవ…్యూ బొజ్జ గణప…్యూ!'' అని అంటూ అతని ఏనుగు బుగ్గలు చిదిమి చిటిక వేశాడు. తర్వాత విఘ్నేశ్వరుడు లక్ష్మికి, సరస్వతికి మ్రొక్కాడు. వాళ్ళిద్దరూ కలిసి అతణ్ణి ఎత్తు కుని చెరో చెంపా ముద్దాడి, ‘‘మేము విఘ్నే శ్వరుడి ఇరుపక్కలా అత్తాకోడళ్ళ పొరపొ చ్చాలు మాని ఇలాగే సఖ్యంగా ఉంటాము!''

.

Thursday, July 23, 2009

సుందరకాండ - 4

త్రిజట తన కల గురించి రాక్షసస్ర్తీలకు చెబుతూండగా మరోవైపు సీత దుఃఖ వివశురాలై బెంబేలు పడిపోయింది. ఎటు చూసినా ఆమెకు ఆశ అన్నది లేదు. రావణుడో, రాక్షస స్ర్తీలో తనను తప్పక చంపుతారనీ, తాను రాముడి కొరకు ఇంత కాలమూ ఎదురు చూడటం నిష్ర్పయోజన మయిందనీ ఆమె అనుకున్నది. నోరెండిపోతూ ఆమె శింశుపా వృక్షం కిందికి పోయి, ఆత్మహత్య చేసుకునే ఆలోచన చేస్తూ తన జడను మెడకు చుట్టుకున్నది. అంతలోనే ఆమెకు శుభ శకునాలు కలిగాయి. ఆమె ఎడమ కన్ను గట్టిగా అదిరింది, ఎడమ భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది. ఈ శుభ శకునాలు చూసి ఆమెకు కొత్త ప్రాణం వచ్చినట్టయింది.
ఇంతసేపూ శింశుపా వృక్షంలో కూర్చుని ఉన్న హనుమంతుడు అంతా చూశాడు. అన్నీ విన్నాడు. కాని అతనికి ఏం చెయ్యటానికీ ఒకంతట పాలుపోలేదు. తాను రాముడి వార్త సీతకు చెప్పి, ఆమె సందేశం రాముడికి అందించాలి. సీతతో మాట్లాడకుండానే తిరిగిపోతే సీతకు రాముడి విషయం తెలియదు; ఆమె ఇక్కడి బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవచ్చు. అదీ గాక, ‘‘సీత ఏమన్నది?'' అని రాముడు తప్పక అడుగుతాడు. ‘‘నేనామెతో మాట్లాడలేదు,'' అంటే రాముడు తన చూపులతోనే నన్ను దగ్ధం చేస్తాడు. పోనీ సీతతో మాట్లాడతామంటే రాక్షస స్ర్తీలంతా ఉన్నారు. పైగా, సీత తనను చూసి రావణుడే మాయూ రూపంలో వచ్చాడనుకుంటుందేమో! అప్పు డామె భయపడి కెవ్వున అరవగానే రాక్షస స్ర్తీలు తన పైకి ఆయుధాలతో వస్తారు

.

విఘ్నేశ్వరుడు - 4

పార్వతి పుత్రగణపతి కేకకు బిరబిరా వచ్చి, తల తెగిపడి ఉన్న బాలుణ్ణి చూసి, శివుణ్ణి చురచుర చూస్తూ, ‘‘ఎంత పనిచేశావు! మన పుత్రుణ్ణి నరికావు! పుత్రహంతకుడివి!'' అంటూ కుప్పలా కూలబడి భోరుమని శోకించసాగింది. అంతవరకు స్తంభించిపోయి చూస్తున్న గుంపులో ఒక్కసారిగా కలకలం సముద్ర ఘోషలాగా చెలరేగింది. పెద్దనేరం చేసిన వాణ్ణిలాగ శివుణ్ణి చూడసాగారు. శివుడికి ముచ్చెమటలు పోశాయి. బిక్కముఖం పెట్టి, ‘‘నాకు తెలి…ుని పుత్రుడా! ఎలాగ వచ్చాడు?'' అన్నాడు.
పార్వతి తనవంటికి పెట్టుకున్న నలుగు ముద్ద ఏవిధంగా పుత్రగణపతి అయినదీ చెప్పింది. దానికి శివుడు పెదవి విరిచి, కోపంగా చూస్తూ, ‘‘నీకు కుమారుడైతే కావచ్చు. అందుకే అమ్మ, అమ్మ అంటూ తెగ వాగాడు. మన పుత్రుడంటున్నావు, ఆ పొగరుబోతు నాకుపుత్రుడెలాగ అవుతాడు?''అని అడిగాడు.
పార్వతి తెల్లబోయింది. అప్పుడు విష్ణువు బ్రహ్మకు సైగచేశాడు. బ్రహ్మ ముందుకు వచ్చి, ‘‘శివుడు పార్వతి చేతిని పుచ్చుకున్న ప్పుడే శివుడి తేజస్సు పార్వతి శరీరం నిండా ప్రవేశించి పులకరింపజేసింది. అది మొదలు శివుడు, పార్వతిలో సగభాగంగా అంతర్లీనమై ఉంటూనే ఉన్నాడు. పుత్రగణపతి శివుడి కుమారుడే!'' అని నాలుగు నోళ్ళతో నొక్కి చెప్పాడు.
శివుడు చేతులు నలుపుకుంటూ దిక్కులు చూస్తూంటే, పార్వతి బాలుడి కళేబరం మీద పడి ఏడుస్తూంటే, ఆకాశం నుండి, ‘‘ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తూన్న తలను తెచ్చి నాకు అతకండి, నేను లేస్తాను!'' అన్న పుత్ర గణపతి వాక్కులు వినిపించాయి

Sunday, July 19, 2009

సుందరకాండ - 3

శింశుపా వృక్షం ఎక్కిన హనుమంతుడు అక్కడి నుంచి చుట్టుపక్కలన్నీ
కలయ జూశాడు. అశోకవనం దేవేంద్రుడి నందన వనం లాగుంది. దాని నిండా
పూల చెట్లూ, పళ్ళ చెట్లూ ఉన్నాయి. పక్షులూ, మృగాలూ ఉన్నాయి. అక్కడక్కడా
దివ్యమైన భవనాలూ, అరుగులూ; తామర పూలూ, కలువపూలూ గల
మడుగులున్నాయి. అన్నిటికన్న అశోక వృక్షాలు జాస్తిగా ఉన్నాయి.
కొద్ది దూరంలో ఒక ఎత్తయిన తెల్లని మండపం ప్రకాశిస్తున్నది.
అందులో వెయ్యి స్తంభాలున్నాయి. దానిలో పగడాలతో తయూరు చేసిన మెట్లూ,
బంగారు అరుగులూ ఉన్నాయి. అది ఒక చైత్యం ఆకారంలో ఉన్నది. తరవాత
హనుమంతుడికి సీత కనిపించింది. ఆమె ధరించిన చీర మట్టి కొట్టుకుని ఉన్నది.
ఆమె చుట్టూ రాక్షస స్ర్తీలున్నారు. ఆమె బాగా కృశించి, నిట్టూర్పులు విడుస్తూ,
దైన్యంతో కూడుకుని ఉన్నది. దేహ సంస్కారం లేక ఆమె శరీరం కూడా మట్టి కొట్టుకుని
ఉన్నది.నగలు చాలా కొద్దిగా ఉన్నాయి. ఆమె జుట్టు ఒకే జడలాగా అట్టకట్టుకుపోయి
తుంటి దాకా వేళ్ళాడుతున్నది. ఈమె సీత అయి ఉండాలని హనుమంతుడు
ఈ విధంగా వితర్కించుకున్నాడు: రావణాసురుడు ఎత్తుకు పోయేటప్పుడు
ఆ స్ర్తీలో తనకూ, సుగ్రీవాదులకూ కనిపించిన పోలికలు ఈమెలో కొన్ని ఉన్నాయి.
నిండు చంద్రుడి వంటి ముఖం. తీర్చినట్టుండే కనుబొమలు, నల్లని వెంట్రుకలు,
అందమైన నడుము-సీత ఎంత కృశించి, శోక సముద్రంలో మునిగి ఉన్నా ఈ
లక్షణాలు దాగటం లేదు.

దెయ్యాల పండుగ

బౌద్ద సన్యాసులు తన కుమారుడిని తీసుకుపోకుండా చేయడానికి ఆమె ఓ ఎత్తు వేసింది.
సాధారణంగా సన్యాసులు శాఖాహారం మాత్రమే తీసుకుంటారు. అయితే ము లియాన్
తల్లి తన ఇంటికి వచ్చిన సన్యాసులకు కొన్ని కూరగాయలతోపాటు కొన్ని మాంసం
ముక్కలను కూడా వేసింది. దీంతో తల్లి వెంటనే దేవతల శిక్షకు గురై నరకానికి పోయిందని
ఓ కథ. తల్లిని కాపాడాలనే ఉద్దేశంతో ము లియాన్ కూడా నరకం లోపలకు చొచ్చుకుపోయాడు.
పోగా పోగా, తల్లి ఒకచోట చుట్టూ రక్తంతో కూడి ఉన్న ముళ్ల పరుపుపై కూర్చుని ఉండటం చూశాడు.
తన తల్లికి తినడానికని మూ లియాన్ కాస్త ఆహారం పెడితే అది వెంటనే నిప్పు లేదా రక్తంలా మారిపోయింది.
దీంతో చేసేదేమీ లేక అతడు తిరిగి ఇంటికి పోయి పూజ ప్రారంభించాడు.

మూలియాన్ ప్రార్థనలను ఆలకించిన బుద్దుడు కరిగిపోయాడు. సంవత్సరంలో ఒక రోజున నరక
ద్వారాలు అన్నీ తెరిచి ఉంచాలని, ఆత్మలు ఆ రోజున భూమ్మీదికి వస్తాయని,ఆప్తులైన వారు
వాటికి ఆహార పదార్ధాలు వడ్డించవచ్చని ఆదేశాలు జారీ చేస్తాడు.చాంద్రమాసం ప్రకారం ఏడవనెల
ఏడవ రోజు (జూలై 15)న చైనీయులు అప్పటినుంచి ఆకలిగొన్న దెయ్యం పండుగను పెద్ద ఎత్తున
జరుపుకోవడం మొదలెట్టారు. చైనా సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అయిదు పెద్ద పండుగ
దినాల్లో ఇది ఒకటి.
జూలై 15 రాత్రి చైనాలో ప్రతి ఇంటి ముందు ఆహారం, నీరు ఉంచుతుంటారు.ఇలా చేస్తే దయ్యాలు
తమ ఇళ్లలోకి రాకుండా ఉంటాయని బయటే ఆహారంతిని వెళ్లిపోతాయని, తమకు సమస్యలు
సృష్టించవని చైనీయుల నమ్మకం.ప్రత్యేకంగా కాగితంతో చేసిన డబ్బును ఈ పర్వ దినం సందర్భగా
చైనీయులుతగులబెడతారు.
దయ్యాలు ఆ కాగితాల మసిని తీసుకుని నరకానికి పోయి అక్కడ తమక్కావలసిన వాటిని ఖర్చు
పెట్టుకుంటాయని చెప్పారు. దయ్యాలు తమకు చిక్కులు కలిగించకుండా ఆరోజంతా చైనీయులు
నాటకాలు, రూపకాలు తదితర ప్రదర్శనలలో పాల్గొంటారు.
భూమ్మీద తమ వారసులను కలుసుకోవడానికి జూలై 15న ఆత్మలు, దయ్యాలునరక ద్వారాలను
దాటి భూమ్మీదికి వస్తాయి. ఈ సందర్భాన్నే చైనీయులు దయ్యాల పండుగలాగా జరుపుకుంటారు

.