Wednesday, July 15, 2009

విఘ్నేశ్వరుడు 1

సత్యలోకంలో కమలాసనం మీద కూర్చుని, పగలంతా సృష్టి చేసి,
చేసి అలసిన బ్రహ్మకు, కల్పాంతం సమీపించటంతో నిద్రమత్తు ఆవరించింది.
ఆ నిద్రమత్తులో ఆ…ున ఆవులించినప్పుడల్లా పర్వతశిఖరాగ్రాలు చిట్లి, అగ్నులను
వెదజల్లాయి. నిద్రపటే్ట సమ…ూన కళ్ళు చెమ్మగిల్లగా, ఆకాశంలో గుంపులు,
గుంపులుగా కూడిన ప్రళ…ు మేఘాలు మెరుపులతో, భ…ుంకరంగా గర్జిస్తూ,
ఏనుగు తొండాలవంటి ధారలతో వర్షించి, లోకాన్ని జలమ…ుం చేశాయి.
ఆ…ున కనురెప్పలు బరువుగా వాలడం ప్రారంభించేసరికి అన్ని దిక్కులా
గాఢాంధ కారం అలుముకున్నది. ఈప్రళ…ు పరిస్థితిలో బ్రహ్మ నిద్రిం చాడు.
ఆ…ునకు ప్రళ…ుమనేది రాత్రి కాలం. తిరిగి నూతన కల్పారంభంకానున్న
సమ…ుం ఆసన్నమైంది. సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించబోతున్న
తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించి భూపాల రాగ స్వరాలను మెల్లగా
పలికిస్తూండగా బ్రహ్మకు మెలకువ వచ్చింది.
ఆ…ున పద్మాసనం వేసి కూర్చుని, నాలుగు ముఖాలతో, నాలుగు దిక్కులూ
కల…ుచూశాడు. కిందవున్న జగత్తు అంతా నీటిమ…ుమై మహాపర్వతాల్లాంటి
కెరటా లతో కల్లోలంగా ఉంది. ఆ తరంగాల మధ్య ఒకచోట కళ్ళను మిరుమిట్లుకొల్పే తెల్లని కాంతిరేఖకనిపించింది. ఆ కాంతిలో తరంగా లపై తేలుతూ ఒక పెద్ద మర్రి ఆకు,
దానిపై చందమామలాంటి పసివాడు పడుకుని కుడి కాలి బొటనవేలు చప్పరిస్తూ
కనిపించాడు.
బ్రహ్మ చేతులు జోడించి, కన్నులుమూసి ధ్యానించి తెరచినంతలో ఒక వింత
దృశ్యం కనిపించింది. ఆ పసివాడు విశ్వవిరాట్ స్వరూపుడైన పరబ్రహ్మమేనని--
బ్రహ్మకు అనుభవపూర్వకంగా తెలిసినవిష…ుమే. కాని ఇప్పుడా పిల్లవాని
తల ఏనుగు తలను పోలి, చిన్నారి తొండంతో కుడిపాదాన్ని పట్టి నోటిలో
పెట్టుతూన్నట్టుగా కనిపించింది.

No comments:

Post a Comment