Monday, July 27, 2009

‘విఘ్నేశ్వరా-6

‘‘విఘ్నేశ్వరా! ఇప్పుడు నీవు చేసిన గజాసుర నిర్మూలన జ్ఞాపకంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కలకాలం ఘనంగా జరుగుతూంటాయి. ముందుకాలంలో ప్రజల స్వేచ్ఛ, శ్రే…యస్సుల కోసం సాగే ఉద్యమాలు గణేశ ఉత్సవాలతో జ…యప్రదంగా కొనసాగి ఫలిస్తాయి. భూలోకంలో వైభంగా జరిగే ఉత్స వాలన్నిటికీ గణపతి నవరాత్రి ఉత్సవం తిలకంగా ఉంటుంది!'' అని ఆకాశవాణి పలికింది. విష్ణువు విఘ్నేశ్వరుడితో, ‘‘పార్వతీనందనా! మేనల్లుడివని చెప్పి నాకు మరొకపని కూడా కల్పించావా!'' అన్నాడు. విఘ్నేశ్వరుడు, ‘‘మేనమామ వరసపెట్టి కాలనేమి అయిన కంసుణ్ణి మేనమామ గండాన నువ్వెలాగూ పుట్టి, చంపుతావుగదా! ఇలాంటి వరసలన్నీ నీవు నేర్పిన విద్యలేగదా నీరజాక్ష!'' అన్నాడు. విష్ణువు, ‘‘విఘ్నవినాశకా! నీ పరశువు ముందు, నా చక్రా…ుుధం ఏపాటి? నీ గొడ్డలి సాము చూసినప్పుడు మహముచ్చటేసింది సుమా!''అన్నాడు. ‘‘పరశురామావతారంలో నా గొడ్డలి ఎరువు తీసుకెళ్ళి గర్వపోతులైన క్షత్రి…యుల్ని తెగ నరుకుదువుగానిలే!''అన్నాడు విఘ్నేశ్వరుడు. విష్ణువు, ‘‘గజవిఘ్నాసురుడి మీద ఎక్కి మర్దిస్తున్నప్పుడు నీ బుడిబుడి నడకల గుజ్జు రూపం కూడా నన్నెంతో మురిపించిందోయి!'' అన్నాడు. ‘‘అలాగైతే, వామనుడివై బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కుదువుగానిలే!'' అని విఘ్నేశ్వరుడు అన్నాడు.

No comments:

Post a Comment