Friday, July 17, 2009

చైనాలో జరుపుకునే పండుగా(దెయ్యపు పండుగ)

చైనా వ్యాప్తంగా జరుపుకునే విశిష్ట పండుగ దెయ్యపు పండుగ.
దీన్నే హంగ్రీ ఘోస్ట్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తుంటారు.
చైనాలో తరతరాలుగా వేళ్లూనుకున్న విశ్వాసాల నేపథ్యంలో
ఈ పండుగ పుట్టింది. దెయ్యపు మాసంగా చెప్పబడే ఈ నెలలో
నరకానికి ఉన్న రెండు ద్వారాలు తెరుచుకుంటాయట.
ఇలా రెండువైపులా నరక ద్వారాలు తెరుచుకున్న సందర్భాల్లో
మనుషులు పెద్దగా గొంతెత్తి అరవడం, ఏడవడం,ఊళ వేయడం
వంటి పనులు చేస్తే అలాంటి వారు సునాయాసంగా చీకటి
ప్రపంచంలోకి లాగివెయ్యబడే ప్రమాదముందని జనం నమ్మిక.
ఈ నెలలో జనం నీళ్లలోకి అడుగుపెట్టకూడదని మరో విశ్వాసం.
నీళ్లలో పొంచుకుని ఉన్న ఆత్మలు ఎవరైనా నీళ్లలో అడుగు
పెడితే చాలు అమాంతంగా లాగేస్తాయట.
దెయ్యాల మాసంగా పిలువబడే జూలై 15 తర్వాత నెల చివరి
వరకూ పెచ్చరిల్లే దెయ్యాలను, ఆత్మలను సంతృప్తి పర్చడానికి
చైనీయులు భారీ ఎత్తున గుమికూడి కలువపూలపై దీపాలు
అమర్చి నీళ్లలోకి వదులుతుంటారు. ఈ దీపాలలో కొవ్వొత్తులను
వెలిగించి నీళ్లలోనూ,గాలిలోనూ ఉంచుతారు.
పెద్ద పెద్ద పూలదండలు తెచ్చి సమాధులలోని దేవతల చిత్రాలను,
డబ్బును ఒకచోట ఉంచి, రాత్రిపూట ఆ డబ్బును తగులబెట్టి డబ్బు
అంటే పడి చచ్చే దెయ్యాలకు సమర్పిస్తుంటారట. ఈ పండుగ
సందర్బంగా ఖాళీ కుర్చీలలో ఎవరూ కూర్చోకూడదు.ఎందుకంటే
అప్పటికే ఏదో ఒక దయ్యం వచ్చి ఆ కుర్చీలో కూర్చుని చూస్తూ
ఉంటుందని జనం నమ్మకం. example:చైనా పురాణాల ప్రకారం, పూర్వం ము లియాన్ అతడి
తల్లి ఓ గ్రామంలో నివసించేవారు. తల్లి క్రూరురాలు. ఎవరైనా
యాచకులు ఇంటికొస్తే బిచ్చం వేయకుండా తరిమివేసేది.తన
బాగు తప్ప ప్రపంచంలో ఇక దేన్ని కూడా పట్టించుకునేది కాదు.
తల్లితో పోలిస్తే ము లియాన్ దయార్ద స్వభావి. ఆపదలో ఉన్నవారిని
ఆదుకోవడం ఇతడి అలవాటు.
ఒకరోజు ములియాన్‌ సన్యాసిగా మారాలనుకున్నాడు.తల్లికి
విషయం తెలియగానే మండిపడింది. ఇంత పనికిరానివాడుగా
తయారయ్యాడంటూ కొడుకును తిట్టింది. తనకోసం కొడుకు బయటకు
పోయి డబ్బు సంపాదించుకు రావాలని కోరుకునేది తప్ప జీవితంలో
మరేదీ ఆమె కంటికి ఆనేది కాదు.

No comments:

Post a Comment