Wednesday, July 15, 2009

సుందరకాండ

జాంబవంతుడు ప్రోత్సాహం ఇవ్వగా హనుమంతుడు రామముద్రికతో
సహా లంకకు దాటి,రావణుడు సీతను ఉంచిన స్థలం కనిపెట్ట
నిశ్చయించుకున్నాడు. అతను శరీరాన్ని పెంచి,
మహేంద్రగిరి పైన అటూ ఇటూ తిరుగుతూ, పెద్ద వృక్షాలను తన
రొమ్ముతో కూలదోస్తూ,మృగాలను చంపుతూ కొంతసేపు సంచరించాడు.
బయలుదేరే ముందు అతను సూర్యుడికీ, ఇంద్రుడికీ, వాయుదేవుడికీ,
బ్రహ్మకూ నమస్కారాలు చేసి,మహేంద్రపర్వతం మీద చేతులూ, కాళ్ళూ
ఆనించి ఒక్క ఊపు ఊపాడు. చలనం ఎరగని మహేంద్రపర్వతం ఆ ఊపుకు
కంపించిపోయింది. దాని మీది శిలలు బద్దలయ్యూయి. గుహలలో ఉండే
ప్రాణులు ఆర్తనాదాలు చేశాయి. పర్వతం మీద ఉండే విద్యాధరులు కంగారు
పడి ఆకాశంలోకి ఎగిరారు.ఋషులూ, చారణులూ, సిద్ధులూ హనుమంతుడు
సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్ళేయత్నంలో ఉండటం గురించి మాట్లాడు
కోసాగారు. హనుమంతుడు తన శరీరం మీది రోమాలను విదిల్చి, ఒక్క
పెడబొబ్బ పెట్టాడు.ఒకసారి దూరం కేసీ, ఒకసారి ఆకాశం కేసీ చూసి,
తన సమీపంలో ఉన్న జాంబవంతుడు మొదలైన వారితో, ‘‘నేను రామబాణం
లాగా వేగంతో లంకకు పోతాను, అక్కడ సీత కనిపించకపోతే అదే వేగంతో
స్వర్గానికి వెళతాను. అక్కడ కూడా సీత లేని పక్షంలో తిరిగి లంకకు వెళ్ళి,
ఆ రావణుణ్ణి బంధించి ఇక్కడికి తెస్తాను. అదృష్టం కలిసివస్తే సీతను తెస్తాను

No comments:

Post a Comment