Friday, July 17, 2009

విఘ్నేశ్వరుడు - 2

దేవతలూ, రాక్షసులూ కలిసికట్టుగా క్షర సాగరమథనం చేసి అమృతాన్ని
సాధించారు. విష్ణువు జగన్మోహినీ రూపంతో రాక్షసులను మోసపుచ్చి
అమృతాన్ని దేవతలపాలు చేశాడు. అమృతం తాగి అమరత్వం పొందిన
దేవతలు గర్వంగా తిరగసాగారు. దానవులకు జరిగిన అన్యా…ూనికి
దేవతలపై కసి తీర్చుకోడానికి తారకాసురుడు ఘోరమైన తపస్సు చేసి,
బ్రహ్మదేవుణ్ణి మెప్పించి, చావులేని వరం కోరాడు.
‘‘పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు చావు తప్ప నిది; మరోవరం ఏదైనా కోరు,
ఇస్తాను,'' అన్నాడు బ్రహ్మదేవుడు. తారకాసురుడు బాగా ఆలోచించి
శివుడి కుమారుడివల్లనే తప్ప మరేవిధంగానూ తనకు చావులేని
వరాన్ని బ్రహ్మనుంచి పొందాడు. అప్పటికి శివుడి భార్య సతీదేవి దక్షƒ
…ుజ్ఞంలో ెూగాగ్నితో తనువు చాలించింది. శివుడు ఉన్మత్తుడిలాగ
తిరిగి, తిరిగి హిమాల…ు పర్వతాల్లో ఒకచోట విరాగిగా కఠోర దీక్షతో
తపస్సు చేస్తూ ఉన్నాడు.
తారకాసురుడు రాక్షసులందర్నీ కూడ గట్టుకొని విజృంభించాడు.
ముల్లోకాలనూ ఆక్రమించుకుని, కసితీరా దేవతలను చిత్ర హింసలు
పెట్టసాగాడు. ఇంద్రాది దేవతలు హడలిపోయి, తమ దీనావస్థను బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ‘‘శివుడికి కుమారుడు పుట్టాలి, అతని వల్లనే
తారకుడు చావాలి! అలాంటి వరాన్ని తారకుడికి ఇచ్చాను మరి.
ఇంకెరివల్లా తారకాసురుడికి ఎటువంటి హానీజరగదు.
మరోవిధంగా అతడికి చావూ లేదు!''అని బ్రహ్మ చెప్పి దేవతలను
వెంటబెట్టుకుని తరుణోపా…ుం కోసం విష్ణువు దగ్గరికి దారి తీశాడు.
‘‘సతీదేవి హిమవంతుడికి కూతురుగా పుట్టి పార్వతిగా పెరుగుతూ
ఉన్నది. శివుడికి పార్వతికి పెళ్ళిజరిగేలా చూడండి!'' అని విష్ణువు
చెప్పాడు. దేవతలు నారదుణ్ణి హిమ వంతుడి దగ్గరికి పంపించారు
.

No comments:

Post a Comment